ఏపీలో కొత్తగా 96 మందికి కరోనా నిర్ధారణ

  • గత 24 గంటల్లో 34,778 కరోనా టెస్టులు
  • అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 22 పాజిటివ్ కేసులు
  • ఒకరి మృతి
  • యాక్టివ్ కేసుల సంఖ్య 635
రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 34,778 కరోనా పరీక్షలు నిర్వహించగా 96 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 22 కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 17, కృష్ణా, నెల్లూరు జిల్లాలలో 9 చొప్పున , తూర్పు గోదావరి జిల్లాలో 7 కేసులు గుర్తించారు. ప్రకాశం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 71 మంది కరోనా నుంచి కోలుకోగా, చిత్తూరు జిల్లాలో ఒకరు మరణించారు. ఏపీలో ఇప్పటివరకు 8,89,681 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,81,877 మంది కరోనా ప్రభావం నుంచి బయటపడ్డారు. రాష్ట్రంలో ఇంకా 635 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారికి చికిత్స కొనసాగుతోంది. అటు, మొత్తం మరణాల సంఖ్య 7,169కి చేరింది.


More Telugu News