శీతాకాలం తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు దిగొస్తాయి: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

  • ఆకాశాన్నంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు
  • నిరంతరం పెరుగుతున్న ధరలతో బెంబేలెత్తుతున్న ప్రజలు
  • డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ధరలు పెరుగుతాయన్న ప్రధాన్
మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నిరంతరం పెరుగుతున్న ఇంధన ధరలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, శీతాకాలం తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు దిగొస్తాయని చెప్పారు.

అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్ ధరలు పెరగడం మనపై ప్రభావం చూపుతోందని అన్నారు. శీతాకాలం తర్వాత పెట్రోలియం ధరలు తగ్గుముఖం పడతాయని చెప్పారు. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ధరలు పెరుగుతాయని అన్నారు. మరోవైపు ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటనపై విపక్షాలు మండిపడుతున్నాయి. పొంతనలేని సమాధానాన్ని మంత్రి ఇచ్చారని విమర్శిస్తున్నాయి.


More Telugu News