పూర్తిగా మహిళల తయారీ​: ఎంజీ నుంచి 50,000వ హెక్టార్​ కారు!

  • ఆ కారును తయారు చేసింది మొత్తం మహిళా సిబ్బందే
  • ప్రకటించిన సంస్థ.. గుజరాత్ హలోల్ ప్లాంట్ లో తయారీ
  • తమ సిబ్బందిలో 33% మహిళలేనన్న ఎంజీ
  • 50 శాతానికి పెంచుతామని వెల్లడి
మోరిస్ గ్యారేజెస్ (ఎంజీ).. భారత విపణిలోకి వచ్చి రెండేళ్లే అవుతున్నా ఆ సంస్థ కార్లకు మాత్రం మంచి డిమాండ్ ఏర్పడింది. సంస్థ విడుదల చేసిన హెక్టార్ కు చాలా మంది అభిమానులూ ఉన్నారు. ఇప్పుడు హెక్టార్ విషయంలో ఎంజీ ఓ మైలురాయిని అందుకుంది. 50,000వ కారును తయారు చేసింది. అయితే దానికో ప్రత్యేకత ఉంది. ఆ ఏభై వేలవ కారును తయారు చేసింది మొత్తం మహిళలే!

దీనిపై సంస్థ అధికారిక ప్రకటన ఇచ్చింది. శుక్రవారం ఆ మైల్ స్టోన్ 50,000వ కారును విడుదల చేసిన సంస్థ.. దానిని గుజరాత్ లోని హలోల్ ప్లాంట్ లోని మహిళా సిబ్బందే తయారు చేశారని చెప్పింది. తమ ఉద్యోగుల్లో 33 శాతం మంది మహిళా సిబ్బంది ఉన్నారని, దానిని 50 శాతానికి పెంచుతామని ప్రకటించింది. 2019లో ఇండియా మార్కెట్ లోకి వచ్చిన ఎంజీ.. హెక్టార్ ను లాంచ్ చేసింది. నెలకు సగటున 3,500 హెక్టార్లు అమ్ముడవుతున్నట్టు కంపెనీ పేర్కొంది. 


More Telugu News