అభిమానుల నుంచి అతి కష్టం మీద తప్పించుకుని కారెక్కిన దీపీకా పదుకుణే!
- నిన్న రాత్రి ముంబైలోని రెస్టారెంట్ కు వెళ్లిన దీపిక
- బయటకు వచ్చేటప్పుడు చుట్టుముట్టిన అభిమానులు
- సెక్యూరిటీ గార్డుల సాయంతో వెళ్లిపోయిన దీపిక
బాలీవుడ్ స్టార్లకు జనాల్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. వారిని చూసేందుకు అభిమానులు ఎగబడతారు. ఇక దీపికా పదుకుణే వంటి అందగత్తెలకు ఎంతటి ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పబ్లిక్ లో తిరగడం కూడా వారికి సాధ్యం కాదు. తాజాగా దీపికకు ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైంది. ముంబైలో నిన్న రాత్రి ఆమె ఓ రెస్టారెంటుకు వెళ్లింది. ఆ తర్వాత బయటకు వచ్చేటప్పుడు ఆమెను అభిమానులు చుట్టుముట్టారు.
రెస్టారెంట్ బయట టిష్యూలు అమ్ముతున్న మహిళలు ఆమె స్లింగ్ బ్యాగ్ ను లాక్కునేందుకు యత్నించారు. ఈ నేపథ్యంలో ఆమె ఒక అడుగు వెనక్కి వేసింది. ఆ తర్వాత తన బాడీగార్డుల సాయంతో వారి నుంచి తప్పించుకుని కారు వద్దకు చేరుకుంది. అక్కడి నుంచి నవ్వుతూ వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనను చుట్టుముట్టిన వారి నుంచి తప్పించుకునే క్రమంలో ఆమె... 'ఏక్ మినిట్... ఏక్ మినిట్' అంటూ ఉండటం వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది.
మరోవైపు దీపిక ప్రస్తుతం తన భర్త రణవీర్ సింగ్ కు జోడీగా '83' సినిమాలో నటిస్తోంది. దీనికి తోడు శకున్ బాత్రా చిత్రంలో కూడా నటిస్తోంది. ఈ చిత్రంలో సిద్ధాంత్ చతుర్వేది, అనన్య పాండే నటిస్తున్నారు.