భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ 'కొవాగ్జిన్' కోసం బ్రెజిల్ ఒప్పందం
- 20 మిలియన్ డోసుల కొవాగ్జిన్ కొనుగోలు
- తొలి ఎనిమిది మిలియన్ల డోసులు బ్రెజిల్‌లో ఉత్పత్తి
- అత్యధిక కరోనా మరణాలు సంభవించిన దేశాల్లో రెండో స్థానంలో బ్రెజిల్
భారత్ అభివృద్ధి చేస్తోన్న కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్ ను తమ దేశ ప్రజలకు అందించడం కోసం బ్రెజిల్ ఒప్పందం కుదుర్చుకుంది. భారత ఔషధ తయారీ సంస్థ భారత్ బయోటెక్ నుంచి 20 మిలియన్ డోసుల కొవాగ్జిన్ వ్యాక్సిన్ కొనుగోలు చేయడానికి ఆర్డర్ ఇచ్చినట్లు తెలిసింది.
ఈ 20 మిలియన్ డోసుల్లో తొలి ఎనిమిది మిలియన్ల డోసులు బ్రెజిల్‌లోని ప్రెసిసా మెడికామెంటోస్‌లోనే ఉత్పత్తి అవుతాయి. వీటిని వచ్చేనెలలో తమ దేశ ప్రజలకు వేస్తామని బ్రెజిల్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
అనంతరం మరో ఎనిమిది మిలియన్ల డోసులు ఏప్రిల్‌లో తమ దేశ ప్రజలకు అందుబాటలోకి వస్తాయని చెప్పాయి. మిగిలిన కొవాగ్జిన్ డోసులు మే నెలలో అందుబాటులోకి వస్తాయని వివరించాయి.
కాగా, అమెరికా, భారత్ తర్వాత బ్రెజిల్లో అత్యధిక మందికి కరోనా సోకిన విషయం తెలిసిందే. మొత్తం ఆ దేశంలో 1,03,90,461 మందికి కరోనా సోకింది. ప్రపంచంలో అత్యధిక మరణాలు సంభవించిన దేశాల్లో రెండో స్థానంలో బ్రెజిల్ ఉంది. ఆ దేశంలో ఇప్పటివరకు మొత్తం 2,51,498 మంది ప్రాణాలు కోల్పోయారు.