ఏపీ పురపాలక ఎన్నికల నేపథ్యంలో.. రేపటి నుంచి ఎస్ఈసీ ఆధ్వర్యంలో ప్రాంతీయ సమావేశాల నిర్వహణ!

  • పుర‌పాలిక ఎన్నిక‌లపై ప్రాంతాల వారీ స‌మావేశాల‌కు నిర్ణ‌యం  
  • అధికార యంత్రాంగం స‌న్న‌ద్ధ‌త కోస‌మే
  • ఈ నెల 27, 28, మార్చి 1న ప్రాంతీయ స‌మావేశాలు
పంచాయతీ ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను పూర్తి చేసిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ఇక పుర‌పాలిక ఎన్నిక‌లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటోంది. ఈ క్రమంలో పుర‌పాలిక ఎన్నిక‌లపై ప్రాంతాల వారీ స‌మావేశాల‌కు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఎస్ఈసీ ప్ర‌క‌టించింది. అధికార యంత్రాంగం స‌న్న‌ద్ధ‌త కోస‌మే ఈ స‌మావేశాల ఏర్పాటుకు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వివ‌రించింది.

ఈ నెల 27, 28, మార్చి 1న ప్రాంతీయ స‌మావేశాలను నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఈ నెల 27న తిరుప‌తిలోని ఎస్వీ యూనివ‌ర్సిటీ సెనేట్ హాల్‌లో స‌మావేశం నిర్వ‌హిస్తామ‌ని వివ‌రించింది.

ఈ స‌మావేశాల్లో భాగంగా క‌లెక్ట‌ర్లు, ఎస్పీలు, మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్లు, ఇత‌ర అధికారుల‌తో ఎస్ఈసీ స‌మావేశం కానుంది. అలాగే, గుర్తింపు పొందిన రాజ‌కీయ పార్టీల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తారు. ఈ నెల 27న (రేపు) ఐదు జిల్లాల్లో రాజ‌కీయ పార్టీల నేత‌ల‌తో స‌మావేశం ఉంటుంది. అనంత‌రం, ఎల్లుండి విజ‌య‌వాడ‌లోని కార్యాల‌యంలో ఎస్ఈసీ స‌మావేశం నిర్వ‌హిస్తుంది. ఇందులో మిగిలిన జిల్లాల అధికారులు పాల్గొంటారు.


More Telugu News