నేడు భార‌త్ బంద్‌.. పెట్రోలు, డీజిల్ ధ‌ర‌ల పెరుగుద‌ల‌కు మూడో రోజు బ్రేక్

  • కొన్ని రోజులుగా పెరుగుతూ వ‌చ్చిన పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు
  • ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.93
  • హైద‌రాబాద్‌లో పెట్రోలు లీట‌రుకు రూ.94.54
  • డీజిల్ ధ‌ర రూ.88.69
కొన్ని రోజులుగా పెరుగుతూ వ‌చ్చిన పెట్రోలు, డీజిల్ ధ‌ర‌ల వ‌ల్ల కేంద్ర ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఈ-వే బిల్లుతో పాటు చ‌మురు ధరల పెరుగుద‌ల‌కు వ్యతిరేకంగా నేడు భారత్ బంద్ నిర్వ‌హిస్తున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఈ రోజు వ‌రుస‌గా మూడోరోజు చ‌మురు సంస్థ‌లు ధరలు పెంచ‌లేదు.

ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.93గా ఉండ‌గా, డీజిల్ రూ.81.32కు చేరింది. హైద‌రాబాద్‌లో పెట్రోలు లీట‌రుకు రూ.94.54, డీజిల్ ధ‌ర రూ.88.69గా ఉంది. ముంబైలో లీట‌రు పెట్రోలు ధ‌ర 97.34, డీజిల్ ధ‌ర  రూ.88.44గా ఉంది.

కాగా, అంతర్జాతీయంగా ఆయిల్ ఉత్పత్తి తగ్గడంతో పాటు క‌రోనా ప్రభావం ఉత్పత్తిపై పడటం ధరల పెరుగుదలకు కారణమని పెట్రోలియం మంత్రిత్వ శాఖ చెప్పుకొస్తోంది. చ‌మురు ధ‌ర‌లపై ఒపెక్ ప్లస్ దేశాలు త్వ‌ర‌లో సమావేశమై, చమురు ఉత్పత్తిని పెంచే అవకాశాలపై చర్చించనున్నాయి.


More Telugu News