ఆలయాలపై దాడులకు పరాకాష్ఠ రామతీర్థం ఘటన: తిరుమలలో చినజీయర్ స్వామి
- ఆలయాలు మన ధర్మానికి మూల కేంద్రాలు
- దేవాలయాలపై ఆధారపడే అన్ని కళలు జీవిస్తున్నాయి
- ఆలయాల్లో తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేస్తాం
ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాలపై జరుగుతున్న దాడులపై త్రిదండి చినజీయర్ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాలపై దాడులకు పరాకాష్ఠ రామతీర్థంలో రాముడి విగ్రహ ధ్వంసం అని చెప్పారు. ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఆలయాలు మన ధర్మానికి మూల కేంద్రాలని చెప్పారు.
దేవాలయాలపై ఆధారపడే అన్ని కళలు జీవిస్తున్నాయని వ్యాఖ్యానించారు. కాగా, కరోనా నుంచి విముక్తి కలగాలని తాను శ్రీవారిని ప్రార్థించానని చెప్పారు. కాగా, తిరుపతి పర్యటన సందర్భంగా నిన్న చినజీయర్ స్వామి తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయాల్లో తీసుకోవాల్సిన చర్యలపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి తాము నివేదిక అందించనున్నామని ఈ సందర్భంగా తెలిపారు.