ఇండియా నుంచి విడిపోయిన దేశాలు ఎప్పటికైనా కలుస్తాయి: మోహన్ భగవత్
- విడిపోయిన దేశాల్లో ఇప్పటికీ అశాంతి
- పాక్, ఆఫ్ఘన్ లు ఎప్పటికైనా కలవచ్చు
- ధర్మబద్ధంగా జీవిస్తున్నది హిందూ సమాజమేనని వ్యాఖ్య
భారత ఉపఖండం ధర్మానికి ప్రతిబింబమని, గతంలో ఇండియా నుంచి విడిపోయిన పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ వంటి దేశాల్లో ఇంతవరకూ శాంతి నెలకొనలేదని వ్యాఖ్యానించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భగవత్, భవిష్యత్తులో ఆ దేశాలు తిరిగి ఇండియాలో కలవచ్చన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాడుగుల నాగఫణి శర్మ రచించిన 'విశ్వ భారతం' పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ ప్రపంచంలో ధర్మబద్ధంగా జీవిస్తున్నది హిందూ సమాజం మాత్రమేనని ఆయన అన్నారు. ఎన్నోరకాల విపత్తుల నుంచి ప్రపంచాన్ని కాపాడే దేశంగా ఇండియాను మిగతా దేశాలు గుర్తిస్తున్నాయని తెలిపారు.