ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్ ఇదేనట!

  • గతేడాది ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా
  • దారుణంగా దెబ్బతిన్న వాణిజ్య రంగం
  • 64.8 మిలియన్ యూనిట్లు అమ్ముడైన ఐఫోన్ 11
  • 2019లో ఐఫోన్ 11ను లాంచ్ చేసిన ఆపిల్
కరోనా మహమ్మారి విలయతాండవం చేసిన 2020లో వ్యాపార రంగానికి అత్యంత గడ్డుకాలం అని చెప్పకతప్పదు. స్మార్ట్ ఫోన్ విక్రయ రంగం కూడా అందుకు మినహాయింపు కాదు. అయితే, ఆపిల్ సంస్థ తయారుచేసే స్మార్ట్ ఫోన్లు మాత్రం ఇతర బ్రాండ్లను మించి అమ్ముడయ్యాయని ఓండియా అనే పరిశోధక సంస్థ వెల్లడించింది. ప్రపంచంలోకెల్లా అత్యధిక విక్రయాలతో ఐఫోన్ 11 నెంబర్ వన్ గా నిలిచిందని వివరించింది.

2020లో ఆపిల్ సంస్థ 64.8 మిలియన్ల ఐఫోన్ 11 స్మార్ట్ ఫోన్లను విక్రయించినట్టు పేర్కొంది. ఐఫోన్ 11ను ఆపిల్ సంస్థ 2019లో లాంచ్ చేసింది. కాగా, ఐఫోన్ 11 తర్వాత అమ్మకాల పరంగా ఐఫోన్ ఎస్ఈ రెండోస్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరుసగా ఐఫోన్ 12, శాంసంగ్ గెలాక్సీ ఏ51, శాంసంగ్ గెలాక్సీ ఏ21ఎస్ ఉన్నాయని ఓండియా తెలిపింది.


More Telugu News