బెజవాడ కనకదుర్గ ఆలయ ఈవో సురేశ్ బదిలీ
- దుర్గ గుడిలో అక్రమాలు అంటూ ఆరోపణలు గుప్పించిన విపక్షాలు
- ఇటీవల ఏసీబీ సోదాలు
- ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన ఏసీబీ
- ఇప్పటివరకు 15 మంది సిబ్బందిపై వేటు
ఇటీవల విజయవాడ కనకదుర్గ ఆలయంలో ఏసీబీ సోదాలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. పలువురు అధికారులను సస్పెండ్ చేయడంతో ఆలయంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలకు బలం చేకూరింది. ఈ క్రమంలో దుర్గ గుడి ఈవో సురేశ్ బాబును బదిలీ చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈవో సురేశ్ బాబు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అనుచరుడంటూ విపక్షాలు ఎలుగెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య ప్రాధాన్యత సంతరించుకుంది.
అమ్మవారి ఆలయంలో సోదాలు జరిపిన ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం 15 మంది సిబ్బందిపై వేటు వేసింది. వారిలో ఐదుగురు సూపరింటిండెంట్ స్థాయి అధికారులు ఉండడం గమనార్హం. ప్రస్తుతానికి సురేశ్ ను బదిలీ చేసిన సర్కారు, త్వరలోనే ఆయనపైనా సస్పెన్షన్ వేటు వేసే అవకాశముందని తెలుస్తోంది.