శబరిమల నిరసనకారులపై నమోదైన కేసులను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించిన కేరళ ప్రభుత్వం
- కేరళ వ్యాప్తంగా దాదాపు 2 వేల కేసుల నమోదు
- ఈ కేసులు తీవ్ర నేర స్వభావం కలిగినవి కాదన్న ప్రభుత్వం
- మంచి నిర్ణయం తీసుకున్నారన్న ప్రతిపక్ష నేత రమేశ్ చెన్నితాల
కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శబరిమల, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన వారిపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో వీటిపై చర్చించారు.
ఈ కేసులు అంత తీవ్రమైన నేర స్వభావం కలిగినవి కాదని ఈ సమావేశంలో నిర్ణయించారు. శబరిమలలోకి మహిళల ప్రవేశానికి సంబంధించి 2018-19లో కేరళ వ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. వీటికి సంబంధించి దాదాపు 2 వేల కేసులు నమోదయ్యాయి. మరోవైపు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్ష నేత రమేశ్ చెన్నితాల స్పందిస్తూ, ఆలస్యమైనా మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.