ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
- గత 24 గంటల్లో 94 కేసుల నమోదు
- చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 21 కేసులు
- ప్రస్తుతం రాష్ట్రంలో 603 యాక్టివ్ కేసులు
దేశంలో కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. ఏపీలో కూడా ఇటీవలి కాలంలో బాగా తగ్గిన కేసులు... మళ్లీ పెరుగుతున్నాయి. నిన్న కొత్తగా 70 కేసులు నమోదు కాగా... ఈరోజు వాటి సంఖ్య మరింత పెరిగింది. గత 24 గంటల్లో 94 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
వీటిలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 21 కేసులు నమోదు కాగా, ప్రకాశం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మరోవైపు 66 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా గణాంకాలతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,89,503కి చేరుకుంది. మొత్తం 8,81,732 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 7,168 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 603 యాక్టివ్ కేసులు ఉన్నాయి.