కలిసి పుట్టారు.. కలిసే అమ్మాయిలుగా మారారు!

  • బ్రెజిల్ లో లింగమార్పిడి చేయించుకున్న ఇద్దరు కవలలు
  • ప్రపంచంలో కవలలు ఒకేసారి ఇలా చేయించుకోవడం మొదటిసారి అంటున్న డాక్టర్లు
  • తాత, అమ్మ ప్రోత్సాహంతో ఆపరేషన్.. బ్రెజిల్ లో ఘటన
వారిద్దరూ కలిసే పుట్టారు.. కలిసే పెరిగారు.. ఏది చేసినా కలిసే చేశారు. పుట్టింది అబ్బాయిగానే అయినా.. ఏనాడూ అబ్బాయిలా ఉండలేదు. అసలు ‘అబ్బాయిలం’ అనే మాటే వారికి నచ్చలేదు. అందుకే ఆపరేషన్ చేయించుకుందామనుకున్నారు. ఆడవాళ్లలాగా మారిపోదామనుకున్నారు. తాత డబ్బు సాయం చేయడం.. అమ్మ ప్రోత్సహించడంతో అబ్బాయిల్లా పుట్టిన ఆ ఇద్దరు కవలలు అమ్మాయిల్లా మారిపోయారు.

ఈ ఘటన బ్రెజిల్ లోని మైనాస్ జెరాయిస్ అనే రాష్ట్రంలో ఉన్న తపీరాలో జరిగింది. ఆ ఇద్దరి పేర్లు మేలా రిజండా, సోఫియా అల్బుకర్క్. మేలా అర్జెంటీనాలో డాక్టర్ చదువుతుంటే.. సోఫియా సావో పాలో సివిల్ ఇంజనీరింగ్ చదువుతోంది. ఈ మధ్యే బ్లూమినాలోని ట్రాన్స్ జెండర్ సెంటర్ బ్రెజిల్ అనే ఆస్పత్రిలో వారు ఆపరేషన్ చేయించుకుని ఆడవారిగా మారారు.

అయితే, ఇప్పటిదాకా కవల పిల్లలు ఇలా ఒకేసారి లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవడం ఎక్కడా చూడలేదని, ఇదే మొదటిసారి అని వారికి ఆపరేషన్ చేసిన డాక్టర్ జోస్ కార్లోస్ మార్టిన్స్ తెలిపారు. కాగా, ఆపరేషన్ కు 20 వేల డాలర్లు ఖర్చు కాగా.. వారి తాత ఆ మొత్తం చెల్లించాడు. ఆడవాళ్లలా మారిన తన బిడ్డలను చూసుకుని మారా లూసియా డ సిల్వ ఆనందం వ్యక్తం చేశారు.

తనకు వారెప్పుడూ అమ్మాయిలేనని అన్నారు. ఈ సమాజం వారిని ఏం చేస్తుందోనని భయపడ్డానే తప్ప.. వారు ఆడపిల్లలుగా మారతారంటే ఎప్పుడూ అడ్డు చెప్పలేదన్నారు.  


More Telugu News