కార్తీ 'సుల్తాన్' తెలుగు డబ్బింగ్ హక్కులకు భారీ రేటు!
- కార్తీకి తెలుగులో కూడా మంచి మార్కెట్
- తాజాగా రష్మికతో కలసి నటించిన 'సుల్తాన్'
- 7 కోట్లకు అమ్ముడుపోయిన తెలుగు రైట్స్
- ఏప్రిల్ 2న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్
ప్రముఖ తమిళ హీరో సూర్య తమ్ముడు కార్తీకి తెలుగు నాట కూడా మంచి అభిమానగణం వుంది. మొదటి నుంచీ తన సినిమాలను తెలుగులోకి డబ్ చేస్తుండడంతో ఇక్కడ కూడా అతనికి మార్కెట్ ఏర్పడింది. గతంలో తను నటించిన ఆవారా, నా పేరు శివ, ఖాకి, ఖైదీ వంటి సినిమాలు తెలుగు ప్రేక్షకులను కూడా అలరించాయి.
అందుకే, కార్తీ ఒక తమిళ సినిమాలో నటిస్తున్నాడంటే దానికి తెలుగులో కూడా క్రేజ్ ఏర్పడుతుంది. ఆ చిత్రం అనువాద హక్కుల కోసం తెలుగు నిర్మాతలు పోటీపడుతుంటారు. అలాగే తాజాగా కార్తీ నటించిన 'సుల్తాన్' చిత్రం డబ్బింగ్ రైట్స్ కోసం కూడా పోటీ ఏర్పడింది.
ఈ క్రమంలో ప్రముఖ పంపిణీదారు వరంగల్ శ్రీను ఈ 'సుల్తాన్' అనువాద హక్కులను రెండు రాష్ట్రాలకూ కలిపి సుమారు 7 కోట్లకు సొంతం చేసుకున్నట్టు తాజా సమాచారం. తెలుగులో కూడా 'సుల్తాన్' పేరుతోనే ఏప్రిల్ 2న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తారు. ఇందులో బిజీ స్టార్ రష్మిక కథానాయికగా నటించడం విశేషం!