అసోంలో వెయ్యిమందికిపైగా మిలిటెంట్ల లొంగుబాటు.. స్వాగతం పలికిన సీఎం
- ఐదు గ్రూపులకు చెందిన 1040 మంది లొంగుబాటు
- లొంగిపోయిన వారిలో పీడీసీకే చీఫ్ సోంగ్‌బిజిత్
- మరో రెండు రోజుల్లో తీవ్రవాద గ్రూపులతో శాంతి ఒప్పందం
- జనజీవన స్రవంతిలో కలిసే వారికి ఆర్థిసాయం
అసోంలో ఐదు తీవ్రవాద గ్రూపులకు చెందిన వెయ్యిమందికిపైగా మిలిటెంట్లు ప్రభుత్వం ఎదుట లొంగిపోయారు. ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ సమక్షంలో వీరంతా ఆయుధాలు అప్పగించి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు.
లొంగిపోయిన వారిలో డెమొక్రటిక్ కౌన్సిల్ ఆఫ్ లోంగ్రి (పీడీసీకే), కర్బి లోంగ్రి ఎన్‌సీ హిల్స్ లిబరేషన్ ఫ్రంట్ (కేఎల్‌ఎన్ఎల్ఎఫ్), కర్బి పీపుల్స్ లిబరేషన్ టైగర్ (కేపీఎల్‌టీ), కుకి లిబరేషన్ ఫ్రంట్ (కేఎల్ఎఫ్), యునైటెడ్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (యూపీఎల్ఏ) సంస్థకు చెందిన వారు ఉన్నారు. మొత్తం 1,040Militants మంది మిలిటెంట్లు లొంగిపోయినట్టు పోలీసులు తెలిపారు. వీరిలో పీడీసీకే చీఫ్ సోంగ్‌బిజిత్ కూడా ఉన్నారు. గతంలో ఆయన నిషేధిత నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోరోలాండ్ కమాండర్ ఇన్ చీఫ్‌గా పనిచేశారు.
లొంగిపోయిన ఉగ్రవాదులకు స్వాగతం పలికిన ముఖ్యమంత్రి సోనోవాల్ మాట్లాడుతూ తీవ్రవాదం నుంచి అసోంను విముక్తి చేస్తానని పేర్కొన్నారు. జనజీవన స్రవంతిలోకి వచ్చే యువతకు తమ ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. అవసరమైన ఆర్థిక సాయాన్ని కూడా అందిస్తున్నట్టు చెప్పారు. లొంగిపోయిన తీవ్రవాదులు మొత్తం 338 ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. వీటిలో 58 ఏకే సిరీస్ రైఫిల్స్, 11 ఎం-16 గన్స్, నాలుగు ఎల్ఎంజీలు ఉన్నట్టు ఏడీజీ (స్పెషల్ బ్రాంచ్) హిరేన్ చంద్రనాథ్ తెలిపారు. మరో రెండు రోజుల్లో తీవ్రవాద గ్రూపులతో శాంతి ఒప్పందం చేసుకోనున్నట్టు ఆయన పేర్కొన్నారు.