చిరంజీవిగారికి చిన్నప్పుడు రాసిన లేఖలకు ఇప్పుడు ప్రతిలేఖ వచ్చినంత అనుభూతి కలుగుతోంది: దర్శకుడు సుకుమార్
- ఉప్పెన సినిమా హిట్ నేపథ్యంలో బహుమతి
- ప్రేమ జంట బొమ్మలు పంపిన చిరు
- చిన్నప్పుడు చిరంజీవికి లేఖలు రాసిన సుకుమార్
దర్శకుడు సుకుమార్‌కు మెగాస్టార్ చిరంజీవి ఓ బహుమతి పంపారు. మెగా కుటుంబం నుంచి పరిచయమైన మరో హీరో వైష్ణవ్ తేజ్ నటించిన మొదటి సినిమా ఉప్పెనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మించిన ఈ సినిమా వసూళ్లపరంగా దూసుకుపోతోంది.
ఈ నేపథ్యంలో ఆ సినిమా యూనిట్ లోని కీలక సభ్యులకు చిరంజీవి బహుమతులు, అభినందన లేఖలు పంపించారు. తనకు కూడా మెగాస్టార్ నుంచి బహుమతి అందిందని తెలుపుతూ సుకుమార్ ట్వీట్ చేశారు.
స్పెయిన్ సంస్థ లాడ్రో విక్రయిస్తున్న ది థ్రిల్ ఆఫ్ లవ్ కపుల్ ఫిగరైన్ బొమ్మలను అందుకున్నట్లు చెబుతూ వాటి ఫొటోలను సుకుమార్ పోస్ట్ చేశారు. సముద్రం ఒడ్డున మోకాళ్లపై కూర్చుని ప్రేమలో మునిగిపోయిన జంట బొమ్మలను అందుకున్నానని చెప్పారు.
వాటి రేటు రూ.89 వేలు ఉంటుంది. 'కొణిదెల చిరంజీవి, మద్రాసు, ఇండియా' అంటూ తాను చిన్నప్పుడు అమాయకంగా రాసిన లేఖలకు ఇప్పుడు ఆయన నుంచి ప్రతిలేఖ వచ్చినంత అనుభూతి కలుగుతోందంటూ ఆయన పేర్కొన్నారు. ఈ సినిమా కీలక దృశ్యాలను సముద్రపు అందాల నడుమ తీశారు. ఈ నేపథ్యంలోనే చిరు ఇటువంటి బొమ్మను పంపారు.