సూరత్ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటిన ఆమ్ ఆద్మీ పార్టీ
- గుజరాత్ లో మున్సిపల్ ఎన్నికలు
- సూరత్ కార్పొరేషన్ లో 27 డివిజన్లు గెలిచిన ఆప్
- ఆప్ వర్గాల్లో సంబరాలు
- ఈ నెల 26న సూరత్ లో విజయోత్సవ ర్యాలీ
- హాజరుకానున్న అరవింద్ కేజ్రీవాల్
తన ప్రాభవం ఢిల్లీకి మాత్రమే పరిమితం కాదని చాటుతూ ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ లోనూ ప్రభావం చూపింది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బోణీ కొట్టింది. ప్రధాన వాణిజ్య నగరం సూరత్ కార్పొరేషన్ కు జరిగిన ఎన్నికల్లో ఆప్ 27 డివిజన్లు గెలుచుకోవడం విశేషం. సూరత్ లో మొత్తం 120 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించగా బీజేపీ 93 డివిజన్లలో నెగ్గింది. అటు, కాంగ్రెస్ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. ఏకంగా 27 డివిజన్లలో గెలవడం పట్ల ఆప్ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 26న సూరత్ లో కేజ్రీవాల్ విజయోత్సవ ర్యాలీలో పాల్గొననున్నారు.
కాగా, గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో ఓవరాల్ గా బీజేపీ ఆధిపత్యం కొనసాగింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ, గుజరాత్ లో మొత్తం 6 కార్పొరేషన్లను బీజేపీ గెలుచుకుందని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం గుజరాత్ మున్సిపల్ ఎన్నికలపై స్పందించారు. బీజేపీకి పట్టం కట్టారంటూ గుజరాత్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు మరోసారి సుపరిపాలనకు మద్దతు ఇచ్చారని తెలిపారు. అభివృద్ధి రాజకీయాలనే ప్రజలు విశ్వసించారని పేర్కొన్నారు.