దేశంలో కరోనా కేసుల పెరుగుదలకు ఈ రెండు వేరియంట్లే కారణమని చెప్పలేం: కేంద్రం

  • దేశంలో కొత్త రకం కరోనా రకాల వ్యాప్తి
  • 187 మందిలో యూకే స్ట్రెయిన్
  • ఆరుగురిలో దక్షిణాఫ్రికా రకం కరోనా
  • ఒకరికి బ్రెజిల్ కరోనా వేరియంట్
  • తెలంగాణలో ఎన్440కే, ఈ484కే వేరియంట్లు
దేశంలో కరోనా కొత్త రకాల వ్యాప్తిపై కేంద్రం వివరాలు తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 187 మందిలో యూకే స్ట్రెయిన్ గుర్తించినట్టు వెల్లడించింది. ఆరుగురిలో దక్షిణాఫ్రికా స్ట్రెయిన్, ఒకరిలో బ్రెజిల్ రకం కరోనా గుర్తించినట్టు వివరించింది. మహారాష్ట్రలో ఎన్440కే, ఈ484కే వేరియంట్లు ఉన్నాయని తెలిపింది.

 ఎన్440కే, ఈ484కే వేరియంట్లు కేరళ, తెలంగాణలోనూ ఉన్నాయని, అయితే మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతుండడానికి ఈ రెండు వేరియంట్లే కారణమని చెప్పలేమని కేంద్రం పేర్కొంది. దేశంలో తాజాగా 10 వేలకు పైగా కరోనా కేసులు రాగా, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 11 మిలియన్లు దాటిపోయింది. ఇప్పటివరకు 10.7 మిలియన్ల మంది కోలుకోగా, 1.56 లక్షల మంది మృత్యువాతపడ్డారు.


More Telugu News