టీఆర్ఎస్ అవినీతిపై కేంద్ర హోంశాఖకు నివేదిక ఇస్తాం: తెలంగాణ బీజేపీ ఇన్చార్జి తరుణ్ చుగ్
- తెలంగాణలో రాక్షస పాలన కొనసాగుతోంది
- టీఆర్ఎస్ అవినీతిపై సీబీఐ విచారణ కోరుతాం
- సింగరేణి సంస్థను కూడా అవినీతిమయం చేశారు
టీఆర్ఎస్ ప్రభుత్వం అంతులేని అవినీతికి పాల్పడుతోందని తెలంగాణ బీజేపీ ఇన్చార్జి తరుణ్ చుగ్ అన్నారు. ప్రభుత్వ అవినీతిపై కేంద్ర హోంశాఖకు నివేదిక అందిస్తామని... సీబీఐ విచారణ జరిపించాలని కోరతామని చెప్పారు. అవినీతి పరులకు శిక్ష పడేంత వరకు పోరాడతామని అన్నారు.
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ లో పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రాక్షసపాలన కొనసాగుతోందని... రాక్షస పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగిస్తామని చెప్పారు.
సింగరేణి సంస్థను కూడా అవినీతిమయం చేశారని... ఆ సంస్థలోని టీబీజీకేఎస్ యూనియన్ ను కవిత తన గుప్పెట్లో ఉంచుకున్నారని తరుణ్ చుగ్ మండిపడ్డారు. పోలీసులు సైతం టీఆర్ఎస్ కనుసన్నల్లో పని చేస్తున్నారని విమర్శించారు. కవిత తన పద్ధతిని మార్చుకోవాలని అన్నారు.