ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు ముగిసిన గడువు.. నామినేషన్ వేసిన ఎల్. రమణ
- ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయాలకు అతీతంగా జరగాలి
- టీడీపీ హయాంలోనే రంగారెడ్డితో పాటు హైదరాబాద్ అభివృద్ధి
- యువతకు ఉద్యోగాలను కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం
తెలంగాణలోని నల్లగొండ-ఖమ్మం-వరంగల్, మహబూబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగిసింది. వాటిని అధికారులు రేపు పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 26 వరకు గడువు ఉంటుంది. వచ్చేనెల 14న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. చివరి రోజు కావడంతో పలువురు అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి వచ్చి మీడియాతో మాట్లాడారు.
మహబూబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి స్థానానికి టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ ఈ రోజు నామినేషన్ వేసి మీడియాతో మాట్లాడుతూ... ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయాలకు అతీతంగా జరగాలని అన్నారు. తనను గెలిపిస్తే అన్ని వర్గాల వారి సమస్యలను శాసన మండలిలో ప్రభుత్వానికి వినిపిస్తానని చెప్పారు. టీడీపీ హయాంలోనే రంగారెడ్డితో పాటు హైదరాబాద్ అభివృద్ధి చెందిందని తెలిపారు. యువతకు ఉద్యోగాలను కల్పించే విషయంలో కేంద్ర సర్కారుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పారు.