చర్య తీసుకోవాల్సింది చిరుద్యోగులపై కాదు.. అసలు దొంగ వెల్లంపల్లి మీద చర్యలు తీసుకోవాలి: కేశినేని

  • విజయవాడ దుర్గ గుడిలో ఏసీబీ సోదాలు
  • 13 మందిపై సస్పెన్షన్ వేటు
  • సస్పెండైన వారిలో ఐదుగురు సూపరింటిండెంట్లు
  • అవినీతికి కారకుడు వెల్లంపల్లేనన్న కేశినేని నాని
గత కొన్నిరోజులుగా బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఏసీబీ సోదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సోదాల్లో వెలుగుచూసిన అవినీతి, అక్రమాల ఆధారంగా అధికారులు 13 మంది ఆలయ ఉద్యోగులపై సస్పెన్షన్ ఆదేశాలు ఇచ్చారు. వీరిలో ఐదుగురు సూపరింటిండెంట్లు, 8 మంది సిబ్బంది ఉన్నారు. దీనిపై టీడీపీ ఎంపీ కేశినేని నాని స్పందించారు. చర్యలు తీసుకోవాల్సింది అమాయకపు చిరుద్యోగులపై కాదన్నారు. ఈ వ్యవహారంలో అసలు దొంగ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అని, సీఎం జగన్ చర్యలు తీసుకుంటే వెల్లంపల్లిపైనే తీసుకోవాలని డిమాండ్ చేశారు.


More Telugu News