చిరంజీవి 'లూసిఫర్'లో త్రిష?

  • రెండు రీమేక్ సినిమాలలో చిరంజీవి 
  • మోహన్ రాజా దర్శకత్వంలో 'లూసిఫర్'
  • ప్రాజక్టు నుంచి తప్పుకున్న నయనతార
  • అడిగిన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన త్రిష
ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న రెండు రీమేక్ సినిమాలలో 'లూసిఫర్' ఒకటి. మలయాళంలో వచ్చిన ఈ హిట్ చిత్రాన్ని తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి రీమేక్ చేస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తికావస్తున్నాయి. ఈ క్రమంలో చిత్రానికి సంబంధించిన అప్ డేట్ ఒకటి వచ్చింది. అదేమిటంటే, ప్రముఖ కథానాయిక త్రిష ఈ చిత్రంలో నటిస్తోందట.

మొదట్లో ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించడానికి నయనతారను చిత్రం యూనిట్ సంప్రదించగా, ఆమె ఓకే చెప్పినట్టు వార్తలొచ్చాయి. అయితే, ఇటీవల ఆమె ఏవో కారణాలు చెప్పి ప్రాజక్టు నుంచి తప్పుకుందట. దాంతో ప్రత్యామ్నాయంగా త్రిష కోసం నిర్మాతలు ప్రయత్నించగా, ఆమె వెంటనే ఓకే చెప్పిందని అంటున్నారు. వచ్చే నెల నుంచి ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది.

ఇదిలావుంచితే, ప్రస్తుతం 'ఆచార్య' చిత్రాన్ని పూర్తిచేస్తున్న మెగాస్టార్.. మరోపక్క తమిళ హిట్ చిత్రం 'వేదాళం' రీమేక్ లో కూడా నటించనున్నారు. దీనికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తాడు. ఈ ప్రాజక్టుకు సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. లూసిఫర్, వేదాళం రీమేక్ ల నిర్మాణం ఏక కాలంలో జరుగుతుందని తెలుస్తోంది.


More Telugu News