భద్రాద్రి రామయ్యకు కేసీఆర్ ఇస్తానన్న రూ.100 కోట్లు ఇవ్వాలి: రఘునందన్ రావు డిమాండ్
- భద్రాద్రికి రూ. 100 కోట్లు ప్రకటించి ఏళ్లు గడుస్తున్నాయి
- కేసీఆర్ ఇచ్చిన మాటను తప్పడం బాధాకరం
- కేసీఆర్ చేతులెత్తేస్తే నెల రోజుల్లో తెస్తామన్న బీజేపీ నేత
భద్రాచలం రాముడి గుడి అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 100 కోట్లు ప్రకటించి ఏళ్లు గడుస్తున్నాయని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందర్ రావు విమర్శించారు. ఆ మాటను కేసీఆర్ మర్చిపోవడం బాధాకరమని అన్నారు. ఆయన ఇస్తానన్న రూ. 100 కోట్లు... ప్రగతి భవన్, కవిత ఆడిన బతుకమ్మ అంత ఖరీదు కూడా కాదని దుయ్యబట్టారు.
కేసీఆర్ నిజంగా హిందువే అయితే వెంటనే రూ. 100 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వడం తమ వల్ల కాదని కేసీఆర్ చేతులెత్తేస్తే... కేంద్ర ప్రభుత్వ సహకారంతో నెల రోజుల్లోనే తాము రూ. 100 కోట్లు తెస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ రాములోరి దర్శనానికి వచ్చారా? అని ప్రశ్నించారు. అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయాన్ని భద్రాది రాముడి ఆశీర్వాదాలతో త్వరలోనే పూర్తి చేసుకుంటామని చెప్పారు.