ప్రజలను మభ్యపెట్టేందుకే గంటా రాజీనామా: విష్ణుకుమార్ రాజు

  • రగులుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ
  • ఎమ్మెల్యే పదవికి గంటా రాజీనామా
  • చంద్రబాబుతో గంటా చర్చించలేదన్న విష్ణు
  • గంటా అనుచరుల సంగతి ప్రజలే చూస్తారని వెల్లడి
ఏపీ బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు రాష్ట్ర తాజా రాజకీయ పరిస్థితులపై స్పందించారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నేపథ్యంలో ప్రజలను మభ్యపెట్టేందుకే గంటా రాజీనామా చేశారని అని ఆరోపించారు. రాజీనామా చేసే ముందు చంద్రబాబుతో గంటా చర్చించలేదని తెలిపారు. గంటా రాజీనామాతో ఆయన అనుచరులు పార్టీలో ఉంటారో, మారతారో ప్రజలే చూస్తారని అన్నారు. అయినా గంటా రాజీనామా ఆమోదం పొందదని అభిప్రాయపడ్డారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గంటా శ్రీనివాసరావు శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడం తెలిసిందే. తన రాజీనామాను స్పీకర్ ఫార్మాట్లో అసెంబ్లీ కార్యదర్శికి పంపారు. ప్రస్తుతం ఈ రాజీనామా స్పీకర్ తమ్మినేని సీతారాం పరిధిలో ఉంది. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తి కలిగిస్తోంది.


More Telugu News