కుప్పకూలిన మార్కెట్లు.. 1,145 పాయింట్లు పతనమైన సెన్సెక్స్!
- అమ్మకాల ఒత్తిడికి గురైన మార్కెట్లు
- 306 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 4.85 శాతం నష్టపోయిన టెక్ మహీంద్రా
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు నష్టాలను చవి చూశాయి. అమ్మకాల ఒత్తిడితో సూచీలు నష్టపోయాయి. రిలయన్స్, హెచ్డీఎఫ్సీ, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్ తదితర బ్లూచిప్ కంపెనీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు నష్టాల్లోనే పయనించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,145 పాయింట్లు నష్టపోయి 49,744కి పడిపోయింది. నిఫ్టీ 306 పాయింట్లు కోల్పోయి 14,675కి దిగజారింది. మెటల్ సూచీ మినహా అన్ని సూచీలు నష్టపోయాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ లో ఓఎన్జీసీ (1.14%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (0.23%), హెచ్డీఎఫ్సీ (0.19%) మాత్రమే లాభాల్లో ముగిశాయి. టెక్ మహీంద్రా (-4.85%), మహీంద్రా అండ్ మహీంద్రా (-4.28%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-4.21%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.95%), యాక్సిస్ బ్యాంక్ (-3.87%) కంపెనీలు టాప్ లూజర్లుగా ఉన్నాయి.