క్రమంగా పెరుగుతున్న తిరుమల భక్తుల సంఖ్య

  • దర్శనాల కోటాను పెంచిన టీటీడీ
  • ఆదివారం 54 వేల మందికి పైగా దర్శనం
  • హుండీ ద్వారా రూ. 3.38 కోట్ల ఆదాయం
తిరుమలలో భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. గత నెల వరకూ వారాంతంలో భక్తుల సంఖ్య 45 నుంచి 50 వేల మధ్యలో ఉంటూ ఉండగా, నిన్న ఆదివారం నాడు ఈ సంఖ్య 54 వేలను దాటింది. ఆర్టీసీ బస్సుల్లో దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ప్రత్యేక కోటాను ఇవ్వడం, రూ. 300 దర్శనాల కోటా సంఖ్యతో పాటు, తిరుపతిలో జారీ చేస్తున్న టోకెన్ల సంఖ్యను పెంచడంతో భక్తుల తాకిడి పెరిగింది.

ఈ క్రమంలో ఆదివారం నాడు మొత్తం 54,218 మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. వారిలో దాదాపు 20 వేలమందికి పైగా భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులను చెల్లించుకున్నారు. స్వామి వారికి హుండీ ద్వారా రూ. 3.38 కోట్ల ఆదాయం లభించింది.


More Telugu News