కోల్ స్కాంలో తన భార్యకు సీబీఐ సమన్లు జారీ చేయడంపై మమత మేనల్లుడి స్పందన

  • బీజేపీ వర్సెస్ టీఎంసీ
  • రుజిరా బెనర్జీకి సీబీఐ నోటీసులు
  • కేంద్రం కుట్ర అంటూ అభిషేక్ బెనర్జీ ఆరోపణలు
  • తమను బెదిరించలేరని స్పష్టీకరణ
  • తాము లొంగేరకం కాదని వ్యాఖ్యలు
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, పశ్చిమ బెంగాల్ అధికార పక్షం టీఎంసీకి మధ్య విభేదాలు మరింత భగ్గుమనేలా మరికొన్ని పరిణామాలు చోటుచేసుకున్నాయి. కోల్ స్కాంలో టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ భార్య రుజిరా బెనర్జీకి సీబీఐ సమన్లు జారీ చేసింది. దీనిపై సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ స్పందించారు.  నేటి మధ్యాహ్నం 2 గంటలకు తన భార్యకు సీబీఐ నోటీసులు అందాయని, చట్టాలపై తమకు గౌరవం ఉందని అభిషేక్ బెనర్జీ స్పష్టం చేశారు.

త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ముందు తమను దెబ్బతీయడానికి కేంద్రం చేస్తున్న కుట్ర అని ఆరోపించారు. అయితే ఇలాంటి కుట్రపూరిత చర్యలతో తమను భయాందోళనలకు గురిచేయాలని భావిస్తే అంతకంటే పొరబాటు మరొకటి ఉండదని పేర్కొన్నారు. తాము బెదిరింపులకు లొంగిపోయే రకం కాదని అభిషేక్ బెనర్జీ ట్వీట్ చేశారు. అంతేకాదు, తన భార్యకు వచ్చిన సీబీఐ నోటీసులను కూడా ఆయన పంచుకున్నారు.


More Telugu News