బెజవాడ టీడీపీ పరిణామాలపై చంద్రబాబు అసంతృప్తి!
- విజయవాడ టీడీపీలో విభేదాలు
- కేశినేని వర్సెస్ బుద్ధా వర్గం!
- స్పందించిన చంద్రబాబు
- నేతల విమర్శలు పార్టీకి నష్టం అని వ్యాఖ్యలు
- వ్యక్తిగత ఆరోపణలు చేస్తే సహించబోనని హెచ్చరిక
విజయవాడ నగర టీడీపీలో ఇటీవల నెలకొన్న పరిణామాలపై పార్టీ అధినేత చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. బహిరంగ విమర్శలు, వ్యక్తిగత ఆరోపణలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. నేతల పరస్పర విమర్శల వల్ల పార్టీకి ఇబ్బందులు వస్తాయని తెలిపారు. 39వ డివిజన్ అభ్యర్థిని నిర్ణయించే వరకు నేతలు వేచిచూడాలని హితవు పలికారు.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బయటి నుంచి వచ్చినవారిని ప్రోత్సహిస్తున్నారంటూ ఎంపీ కేశినేని నానిపై బుద్ధా వెంకన్న వర్గం ఇటీవల విమర్శలు చేయడమే కాకుండా, ఓ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీ వర్గాన్ని బుద్ధా వర్గం అడ్డుకున్నట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. అ తర్వాత కేశినేని నాని పలు సందర్భాల్లో బెజవాడ టీడీపీ పరిణామాలపై బాహాటంగానే స్పందించారు. ఈ నేపథ్యంలో టీడీపీ చీఫ్ చంద్రబాబు జోక్యం చేసుకున్నట్టు తెలుస్తోంది.