తెలంగాణ క్రీడాకారులను ఐపీఎల్ లో అంటరానివాళ్లుగా చూస్తున్నారు: దానం నాగేందర్
- ఐపీఎల్ నేపథ్యంలో దానం వ్యాఖ్యలు
- ప్రతిభావంతులకు ప్రాతినిధ్యం దక్కడంలేదని వెల్లడి
- విజయ్ హజారే టోర్నీలో ఆడినవాళ్లను ఎంపిక చేశారన్న దానం
- సీఎం కేసీఆర్ స్పందించాలని విజ్ఞప్తి
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఐపీఎల్ నేపథ్యంలో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ గురుబ్రహ్మ నగర్ లో జరిగిన సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఐపీఎల్ పరిస్థితులపై స్పందించారు. ప్రతిభావంతులకు సరైన ప్రాతినిధ్యం లభించడంలేదని, తెలంగాణ క్రికెటర్లను ఐపీఎల్ లో అంటరానివాళ్లుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణలో అసలు నైపుణ్యం ఉన్న ఆటగాళ్లే లేనట్టుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఎలాంటి ప్రతిభ లేకపోయినా విజయ్ హజారే టోర్నీలో ఆడినవాళ్లను ఎంపిక చేశారని ఆరోపించారు. తెలంగాణ క్రికెటర్లకు ఐపీఎల్ లో సరైన గుర్తింపు లభించేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలని దానం కోరారు.
దానం నిన్న కూడా ఐపీఎల్ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీపై విరుచుకుపడ్డారు. ఐపీఎల్ వేలంలో ఒక్క హైదరాబాద్ ఆటగాడ్ని కూడా తీసుకోలేదంటూ సన్ రైజర్స్ యాజమాన్యంపై మండిపడ్డారు. హైదరాబాద్ ఆటగాళ్లు లేకుండా అది హైదరాబాద్ జట్టు ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఆ ఫ్రాంచైజీ పేరు మార్చుకోవాలని అన్నారు.