ప్రతి దాన్ని ఎన్నికల కోణంలో చూడటం దేశానికి మంచిది కాదు: నవీన్ పట్నాయక్
- ప్రభుత్వ కార్యక్రమాలకు ఎన్నికల రంగు పూయడం దేశాభివృద్ధికి మంచిది కాదు
- ప్రతి నేరాన్ని రాజకీయమయం చేస్తున్నారు
- ఎన్నికల మూడ్ నుంచి దేశం బయటకు రావాలి
ప్రభుత్వ కార్యక్రమాలకు ఎన్నికల రంగు పూయడం దేశ అభివృద్దికి మంచిది కాదని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అన్నారు. నేరాలపై రాజకీయాలు చేయడం కూడా మంచిది కాదని చెప్పారు. ప్రతి నేరాన్ని రాజకీయమయం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని ఎన్నికల కోణంలోనే చూస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితి శాంతిభద్రతలకు, అభివృద్ధికి పెను విఘాతం కలిగిస్తుందని చెప్పారు. ఎన్నికల మూడ్ నుంచి దేశం బయటకు రావాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు.
ప్రభుత్వాలను సజావుగా పని చేసుకోనివ్వాలని చెప్పారు. పార్టీలకు అతీతంగా పని చేసినప్పుడే ప్రజాస్వామ్యం బలపడుతుందని అన్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన ఈరోజు జరిగిన నీతిఆయోగ్ సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనాను ఎదుర్కోవడంలో పార్టీలకు అతీతంగా అందరం కలిసి పనిచేశామని... ఇదే స్ఫూర్తిని అన్ని విషయాలలో కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పారు.