షర్మిల సమయం వృథా చేసుకుంటున్నారు: ఎంపీ అరవింద్
- తెలంగాణలో పార్టీ ఏర్పాటుకు షర్మిల ప్రయత్నాలు
- విస్తృతంగా సమావేశాలు
- తెలంగాణకు కావాల్సింది రాజన్న రాజ్యం కాదన్న అరవింద్
- రామరాజ్యం కావాలని వ్యాఖ్యలు
దివంగత వైఎస్సార్ కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ స్థాపనకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ, బీజేపీ యువనేత ధర్మపురి అరవింద్ స్పందించారు. షర్మిల పార్టీ హలెలూయా పార్టీ అని వ్యంగ్యం ప్రదర్శించారు. తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు పేరుతో షర్మిల సమయం వృథా చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణకు కావాల్సింది రాజన్న రాజ్యం కాదని, రామరాజ్యం అని అరవింద్ ఉద్ఘాటించారు.
మరోపక్క, పార్టీ ఏర్పాటుకు వేగంగా ముందుకు కదులుతున్న షర్మిల ఇవాళ రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన వారి నుంచి అభిప్రాయ సేకరణ నిమిత్తం ఫీడ్ బ్యాక్ పత్రాలు ఇచ్చినట్టు తెలుస్తోంది.