ప్రధానికి లేఖ రాస్తే జైల్లో పెడతారని చంద్రబాబుకు భయం: రోజా
- విశాఖలో విజయసాయి పాదయాత్ర
- పాల్గొన్న ఎమ్మెల్యే రోజా
- సీఎం జగన్ ప్రధానికి లేఖ రాశారని వెల్లడి
- స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సీఎం వ్యతిరేకమన్న రోజా
- చంద్రబాబు మొసలికన్నీరు కార్చుతున్నారని విమర్శలు
విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ పోరాట యాత్ర పేరుతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేపట్టిన పాదయాత్రలో నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ ఆర్కే రోజా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు సీఎం జగన్ కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ కూడా రాశారని వెల్లడించారు.
అయితే, 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు, ఆయన కొడుకు ఎందుకు ప్రధానికి లేఖ రాయలేకపోతున్నారని రోజా ప్రశ్నించారు. లేఖ రాస్తే చేసిన తప్పులకు జైల్లో పెడతారన్న భయమా? అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు విశాఖ వచ్చి మొసలికన్నీరు కార్చుతున్నారని, సీఎం జగన్ స్టీల్ ప్లాంట్ ను అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మెడ మీద తల ఉన్నవాళ్లు ఎవరూ ఇలా మాట్లాడరని విమర్శించారు. 56 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించింది చంద్రబాబు కాదా? అని రోజా నిలదీశారు.