సీఎం జగన్ విజన్ కు నీతి ఆయోగ్ ప్రశంసలు

  • మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ
  • హాజరైన సీఎం జగన్
  • భారత్ నెట్ ప్రాజెక్టుపై తన విజన్ వివరించిన సీఎం జగన్
  • జగన్ ట్వీట్ ను రీట్వీట్ చేసిన నీతి ఆయోగ్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ఇవాళ ఏపీ సీఎం జగన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ విజన్ కు నీతి ఆయోగ్ పాలక మండలి సంతృప్తి వ్యక్తం చేసింది. పల్లెపల్లెకు ఇంటర్నెట్ ను తీసుకెళ్లాలన్న జగన్ ఆకాంక్షను అభినందించింది. భారత్ నెట్ ప్రాజెక్టు పేరిట ప్రతిగ్రామంలో ప్రతి వ్యక్తికి ఇంటర్నెట్ అందుబాటులోకి తేవాలన్న జగన్ సంకల్పాన్ని ప్రశంసించింది. ఈ క్రమంలో ఏపీ సీఎం చేసిన ట్వీట్ ను నీతి ఆయోగ్ రీట్వీట్ చేసింది.

కాగా, నీతి ఆయోగ్ భేటీలో సీఎం జగన్ గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ అంశంపై స్పందించారు. గ్రామాల్లో ప్రజా వ్యవస్థలకే కాకుండా, ప్రతి పౌరుడికి ఇంటర్నెట్ ను అందించడమే తమ లక్ష్యమని, గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేస్తామని వివరించారు. వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని ప్రజలకు అత్యంత చేరువ చేయడమే తమ ప్రాజెక్టు వెనుకున్న ఉద్దేశమని వెల్లడించారు.


More Telugu News