80 శాతం హిందువులున్న దేశంలో శివాజీ విగ్రహం కాక బాబర్, అక్బర్ విగ్రహాలు ఏర్పాటు చేస్తారా?: బండి సంజయ్
- బోరబండలో శివాజీ విగ్రహ ఏర్పాటు నేపథ్యంలో ఉద్రిక్తత
- అదే స్థలంలో విగ్రహం నెలకొల్పుతామన్న బండి సంజయ్
- ఆ ప్రాంతానికి శివాజీ చౌక్ గా నామకరణం చేస్తామని వెల్లడి
- 2023లో తెలంగాణలో హిందూ రాజ్య స్థాపన చేస్తామని ఉద్ఘాటన
హైదరాబాదులోని బోరబండలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటు ఉద్రిక్తతలకు దారితీసిన నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. విగ్రహం తొలగించిన చోటే శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. 80 శాతం హిందువులున్న దేశంలో హిందూ ధర్మ స్థాపకుడు శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటును అడ్డుకుంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో శివాజీ విగ్రహాలు కాక బాబర్, అక్బర్ విగ్రహాలు ఏర్పాటు చేస్తారా? అని మండిపడ్డారు.
బోరబండలో శివాజీ విగ్రహాన్ని తొలగించిన చోటే ఆయన నిలువెత్తు విగ్రహాన్ని నెలకొల్పుతామని, ఆ ప్రాంతానికి శివాజీ చౌక్ గా నామకరణం చేస్తామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ప్రతి ఊర్లో, ప్రతి వీధిలో శివాజీ విగ్రహాలు ఏర్పాటు చేస్తామని వివరించారు. శివాజీ స్ఫూర్తితో 2023లో తెలంగాణలోనూ హిందూరాజ్య స్థాపన చేసి, గోల్కొండ కోటపై కాషాయ జెండా రెపరెపలాడిస్తామని ఉద్ఘాటించారు.