ధరల పెరుగుదలకు ప్ర‌జ‌లు అలవాటు పడిపోయారు..‌ వారికేమీ ఇబ్బందిలేదు: బీహార్ మంత్రి

  • ధరల పెరుగుదల వలన ఎటువంటి ప్రభావం ఉండదు
  • ధరలు పెరిగితే ప్ర‌జ‌లు సొంతవాహనాలను వాడ‌రు
  • బస్సుల్లో ప్ర‌యాణాలు చేస్తారు
దేశంలో పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్‌తో పాటు అనేక వ‌స్తువుల ధ‌ర‌లు పెరిగిపోతోన్న విష‌యం తెలిసిందే. దీంతో ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు వ‌స్తోన్న నేప‌థ్యంలో బీహార్ మంత్రి నారాయణ్ ప్రసాద్ చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ధరల పెరుగుదలకు ప్ర‌జ‌లు అలవాటు పడిపోయారని, ధ‌రల పెరుగుద‌ల వ‌ల్ల‌ వారికేమీ ఇబ్బందిలేద‌ని చెప్పుకొచ్చారు.

ధరల పెరుగుదల వలన ఎటువంటి ప్రభావం ఉండబోదని వ్యాఖ్యానించారు. ధరలు పెరిగితే ప్ర‌జ‌లు సొంతవాహనాలను వాడ‌కుండా బస్సుల్లో ప్ర‌యాణాలు చేస్తార‌ని తెలిపారు.  బడ్జెట్ వచ్చిన స‌మ‌యంలో ధరలు పెరుగుతుంటాయని, దాని ప్రభావం ఏమీ ఉండదని తెలిపారు. ప్ర‌జ‌లు క్ర‌మంగా అలవాటు పడిపోతారని తెలిపారు. కాగా, బీహార్‌లో ధరల పెరుగుదలపై  అసెంబ్లీ ప్రాంగ‌ణం వ‌ద్ద ప్ర‌తిప‌క్ష పార్టీలు నిరసన వ్య‌క్తం చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి.


More Telugu News