మీరే నాకు అతి పెద్ద బలం: రామ్ చరణ్
- ఈరోజు చిరంజీవి దంపతుల 42వ వివాహ వార్షికోత్సవం
- 1980 ఫిబ్రవరి 20న చిరు, సురేఖల వివాహం
- చిరు దంపతులకు వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు
తన తల్లిదండ్రులకు సినీ నటుడు రామ్ చరణ్ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు. ఈరోజు చిరంజీవి, సురేఖ దంపతులు 42వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. తన తల్లిదండ్రులే తనకు అతిపెద్ద బలం అని ఈ సందర్బంగా చరణ్ ట్వీట్ చేశాడు. మీ ఇద్దరికీ 42వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు అని తెలిపాడు. 1980 ఫిబ్రవరి 20న చిరంజీవి, సురేఖల వివాహం జరిగింది. మరోవైపు ఇతర సినీ ప్రముఖులు కూడా చిరంజీవి దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.