పెట్రో ధరల పెరుగుదలకు పడని కళ్లెం.. వరుసగా 12వ రోజూ ధరలు పైపైకే!
- కొండెక్కుతున్న పెట్రోలు, డీజిల్ ధరలు
- లీటరు పెట్రోలుపై 39 పైసలు, డీజిల్‌పై 37 పైసలు పెరుగుదల
- హైదరాబాద్‌లో రూ.94 దాటిన పెట్రోలు ధర
దేశంలో పెట్రో ధరల పెరుగుదలకు అడ్డుకట్ట పడడం లేదు. వరుసగా 12వ రోజైన నేడు కూడా చమురు ధరలు పెరిగాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో లీటర్ పెట్రోలుపై 39 పైసలు, డీజిల్‌పై 37 పైసలు పెంచుతూ దేశీయ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.
తాజా ధరల పెంపుతో ఢిల్లీలో లీటర్ పెట్రోలు ధర రూ. 90 మార్కును దాటేసి రూ. 90.58కి చేరుకుంది. డీజిల్ ధర రూ. 80.97గా ఉంది. హైదరాబాద్‌లో వీటి ధరలు వరుసగా రూ. 94.18, రూ.88.31గా ఉండగా, బెంగళూరులో 94.18, రూ. 88.31కి చేరుకున్నాయి. ముంబైలో లీటర్ పెట్రోలు ధర రూ. 97.00గా ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ. 88.06గా ఉంది.