'స్టాండ్ విత్ దిశా రవి' హ్యాష్ ట్యాగ్‌తో గ్రెటా థన్‌బర్గ్ ట్వీట్
- టూల్‌కిట్ వివాదంలో అరెస్ట్ అయిన దిశా రవి
- జ్యుడీషియల్ కస్టడీని మూడు రోజులు పొడిగించిన కోర్టు
- అవి రాజీపడకూడని మానవ హక్కులన్న గ్రెటా
టూల్‌కిట్ వివాదంలో అరెస్ట్ అయిన 22 ఏళ్ల పర్యావరణ ఉద్యమకారిణి దిశా రవికి మద్దతుగా స్వీడన్‌కు చెందిన పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్ ట్వీట్ చేశారు. #StandWithDishaRavi హ్యాష్‌ట్యాగ్‌తో చేసిన ఈ ట్వీట్‌లో.. మాట్లాడే స్వేచ్ఛ, ప్రశాంతంగా నిరసన తెలిపే స్వేచ్ఛ అనేవి రాజీపడకూడని మానవ హక్కులని, ప్రజాస్వామ్యంలో అవి భాగం కావాల్సిందేనని పేర్కొన్నారు.
కాగా, దిశా రవి జ్యుడీషియల్ కస్టడీని మరో మూడు రోజులు పొడిగిస్తూ ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు తీర్పు చెప్పింది. దిశా రవి అరెస్ట్ అయిన ఐదు రోజుల తర్వాత గ్రెటా స్పందించడం గమనార్హం.
కాగా, దిశా రవి జ్యుడీషియల్ కస్టడీని మరో మూడు రోజులు పొడిగిస్తూ ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు తీర్పు చెప్పింది. దిశా రవి అరెస్ట్ అయిన ఐదు రోజుల తర్వాత గ్రెటా స్పందించడం గమనార్హం.