ఇండియా-చైనా బలగాల ఉపసంహరణ పూర్తి.. రేపు సీనియర్ కమాండర్ల మధ్య 10వ విడత చర్చలు
- వెనక్కి వెళ్లిన 150 చైనా యుద్ధ ట్యాంకులు
- పాంగాంగ్ ప్రాంతాన్ని ఖాళీ చేసిన 5 వేల మంది చైనా సైనికులు
- ఇరు దేశాల మధ్య చల్లబడ్డ ఉద్రిక్తత
తూర్పు లడఖ్ లోని పాంగాంగ్ సరస్సు వద్ద నెలకొన్న ఉద్రిక్తతలు చల్లబడ్డాయి. ఆ ప్రాంతం నుంచి భారత్, చైనా తమ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకున్నాయి. చైనాకు చెందిన దాదాపు 150 యుద్ధ ట్యాంకులు, 5 వేల మంది సైనికులు పాంగాంగ్ నుంచి వెనక్కి వెళ్లిపోయారు. కూల్చివేయబడిన చైనా టెంట్లు, వెనక్కి వెళ్తున్న చైనా బలగాలకు సంబంధించిన ఫొటోను ఇండియన్ ఆర్మీ షేర్ చేసింది.
మరోవైపు, రేపు భారత్, చైనా దేశాల మధ్య సీనియర్ కమాండర్ల స్థాయిలో 10వ విడత చర్చలు జరగబోతున్నాయి. ఇదిలావుంచితే, గాల్వన్ లోయలో జరగిన ఘర్షణలో తాము ఐదుగురిని కోల్పోయినట్టు చైనా ఆర్మీ అధికారికంగా ప్రకటించింది. 45 మంది చైనా సైనికులు చనిపోయారంటూ రష్యా మీడియాలో కథనం వచ్చిన వెంటనే... చైనా ఈ మేరకు ప్రకటన చేయడం గమనార్హం.