ఈ వారాన్ని భారీ నష్టాల్లో ముగించిన మార్కెట్లు

  • లాభాల స్వీకరణకు మొగ్గుచూపిన ఇన్వెస్టర్లు
  • 434 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 137 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు భారీగా నష్టపోయాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకే మొగ్గు చూపడంతో మార్కెట్లు నష్టాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 434 పాయింట్లు కోల్పోయి 50,889కి పడిపోయింది. నిఫ్టీ 137 పాయింట్లు నష్టపోయి 14,981 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.97%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.56%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (1.46%), ఎన్టీపీసీ (0.87%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (0.73%).

టాప్ లూజర్స్:
ఓఎన్జీసీ (-5.06%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-3.77%), యాక్సిస్ బ్యాంక్ (-3.48%), ఐసీఐసీఐ బ్యాంక్ (-3.20%), బజాజ్ ఆటో (-2.72%).


More Telugu News