వామనరావు దంపతుల హత్య కేసు.. జడ్పీ ఛైర్మన్ మేనల్లుడి అరెస్ట్!

  • పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీనివాస్ అరెస్ట్
  • కారు, రెండు కత్తులను సమకూర్చినట్టు నిర్ధారణ
  • నలుగురినీ ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసులు
ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన న్యాయవాది వామనరావు దంపతుల హత్య కేసులో మరో కీలక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్, టీఆర్ఎస్ నేత పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీనును అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని డీసీపీ రవీందర్ వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య చేసేందుకు వాహనాన్ని, ఆయుధాలను సమకూర్చినట్టు బిట్టు శ్రీను మీద అభియోగాలు ఉన్నాయి.

కేసులో ప్రధాన నిందితుడైన కుంట శ్రీనివాస్ కు కారుతో పాటు, రెండు కత్తులను బిట్టు శ్రీనివాస్ సమకూర్చినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ క్రమంలో బిట్టు శ్రీనును అరెస్ట్ చేశారు. అయితే, పెద్దపల్లి జిల్లాపరిషత్ ఛైర్మన్ మేనల్లుడు కావడంతో బిట్టు శ్రీను అరెస్ట్ సంచలనంగా మారింది. మరోవైపు కుంట శ్రీనివాస్, అక్కపాక కుమార్, శివందు చిరంజీవి, బిట్టు శ్రీనివాస్ లను ఈరోజు మంథని కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టనున్నారు.


More Telugu News