అమెజాన్ తీరు అనైతికం... భారత వ్యాపార సంఘాల సమాఖ్య తీవ్ర అసంతృప్తి

  • అమెజాన్ ను నిషేధించాలన్న సీఏఐటీ
  • చిరు వ్యాపారులను దెబ్బతీస్తోందని ఆరోపణ
  • ఫెమా లొసుగులను ఉపయోగించుకుంటున్నట్టు వెల్లడి
  • ఈ-కామర్స్ సంస్థల వ్యాపార విధానాలపై దర్యాప్తుకు డిమాండ్
ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ అమ్మకాలలో అగ్రగామి ఈ-కామర్స్ పోర్టల్ గా వెలుగొందుతున్న అమెజాన్ ను భారత్ లో నిషేధించాలని భారత వ్యాపార సంఘాల సమాఖ్య (సీఏఐటీ) డిమాండ్ చేస్తోంది. దేశంలోని చిరు వ్యాపారులను, చిన్న సంస్థలను అమెజాన్ చిదిమేస్తోందని సీఏఐటీ ఆరోపించింది. ఇష్టంవచ్చిన రీతిలో ధరలు, భారీ రాయితీలు ప్రకటిస్తూ, నియంత్రిత సరఫరాలకు పాల్పడుతోందని అసంతృప్తి వ్యక్తం చేసింది.

దీనిపై సీఏఐటీ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ స్పందిస్తూ... భారీ నిధులు కలిగివున్న అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థల విధానాలపై దర్యాప్తు చేపట్టాలని కోరారు. ఈ రెండు  ఈ-కామర్స్ సంస్థలు ఫెమా (విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం)లోని లొసుగులను ఆసరాగా చేసుకుని వ్యాపార రంగంలో పోటీని అణగదొక్కుతున్నాయని ఖండేల్వాల్ ఆరోపించారు.


More Telugu News