ఆ భూములను అమ్మించి తన బినామీల పరం చేయాలన్నది జగన్నాటకం: యనమల
- విశాఖ స్టీల్‌ప్లాంట్ భూములపై కన్నుపడింది
- అందుకే ప్రధాని మోదీకి జగన్ లేఖ రాశారు
- జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి సూత్రధారులు
- అరబిందో, హెటిరోకి చెందిన వారు పాత్రధారులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ భూములపై కొనసాగుతోన్న వివాదంపై ఆయన స్పందిస్తూ... ఆ భూముల్ని తన చేతికి మట్టి అంటకుండా కేంద్ర ప్రభుత్వం ద్వారా అమ్మించి తన బినామీల పరం చేయాలన్నది జగన్నాటకమని ఆయన ఆరోపించారు.
అందుకే ప్రధాని నరేంద్ర మోదీకి జగన్ లేఖ రాశారని చెప్పారు. వాటి అమ్మకం కుట్రలో జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సూత్రధారులు అని ఆయన ఆరోపించారు. ఇందులో అరబిందో, హెటిరోకి చెందిన వారు పాత్రధారులని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో కాకినాడ సెజ్, బే పార్క్ భూములను తీసుకున్నారని తెలిపారు.
మొదట విశాఖపట్నం భూములు, ఆశ్రమ భూములపై వారి కన్ను పడిందని, ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ భూములపై వారి దృష్టి ఉందని ఆరోపించారు. జగన్ చేస్తోన్న వ్యాఖ్యలను బట్టి పోస్కోతో ఒప్పందం నిజమేనని తెలుస్తోందని యనమల అన్నారు. ఎకరాకు దాదాపు రూ.మూడు కోట్ల విలువ చేసే ఈ భూముల ప్రయోజనం స్థానికులకే దక్కాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేగానీ, ఈ భూముల ప్రయోజనాలు జగన్ బినామీల పరం కాకూడదని చెప్పారు.