ఆ విషయాన్ని ఇప్పుడే ప్రకటిస్తే తొందరపాటు అవుతుంది: ట్రంప్
- 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై మాట్లాడడం సరికాదు
- దేశంలో నాకు చాలా మద్దతు ఉంది
- రెండుసార్లు అభిశంసన ఎదుర్కొన్న నేతను నేనే
- బైడెన్ కు మానసిక సమస్య ఏదైనా ఉండొచ్చు
శ్వేతసౌధాన్ని వీడిన తర్వాత తొలిసారి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ తన రాజకీయ భవిష్యత్తు గురించి ప్రస్తావించారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేసే విషయంపై ఆయన స్పందిస్తూ... దానిపై ఇప్పుడే ఏమైనా ప్రకటిస్తే అది తొందరపాటు చర్యే అవుతుందని తెలిపారు. అందుకే దాని గురించి తాను ఇప్పట్లో మాట్లాడటం సరికాదని ఆయన తెలిపారు.
అంతేగాక, చాలా గొప్ప ఎన్నికలు ముందున్నాయని, వాటి గురించి ఇప్పుడే తాను ఏమీ చెప్పలేనని అన్నారు. తనకు దేశంలో చాలా మద్దతు ఉందని, రెండుసార్లు అభిశంసన ఎదుర్కొన్న నేతనూ తానేనని చెప్పుకున్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ సరిగ్గా జరగలేదంటూ, అమెరికా అధ్యక్షుడు బైడెన్ చేసిన వ్యాఖ్యలకు ట్రంప్ కౌంటర్ ఇచ్చారు. బైడెన్ అసత్యాలు చెప్పి ఉండొచ్చని, లేదంటే ఆయనకు మానసిక సమస్య ఏదైనా ఉండొచ్చని ఎద్దేవా చేశారు.