గాల్వన్ ఘర్షణలో తమ సైనికుల మృతుల సంఖ్యను తొలిసారి ప్రకటించిన చైనా
- ఐదుగురే చనిపోయినట్లు ప్రకటించిన చైనా
- వారికి అవార్డులు ఇస్తున్నట్లు ప్రకటన
- 45 మంది చైనా సైనికులు మృతి చెందారని ఇటీవలే రష్యా ప్రకటన
గత ఏడాది జూన్‌లో గాల్వన్ సరిహద్దుల్లో చెలరేగిన ఘర్షణలో మృతి చెందిన తమ సైనికుల సంఖ్యను భారత్ ప్రకటించినప్పటికీ చైనా మాత్రం ప్రకటించని విషయం తెలిసిందే. చైనా సైనికుల మృతుల/గాయపడిన వారి సంఖ్య 35 ఉంటుందని అప్పట్లో భారత్ ప్రకటించింది. ఆ ఘర్షణలో చైనా సైనికులు 45 మంది మృతి చెందారని ఇటీవల రష్యా మీడియా కూడా ప్రకటించింది. అయితే, తమ సైనికులు చనిపోలేదని ఇన్ని నెలలూ చెప్పుకుంటూ వచ్చిన వచ్చిన చైనా చివరకు చేసేది ఏమీ లేక మృతుల సంఖ్యను ప్రకటించింది.
అయితే, తమ సైనికులు ఐదుగురు మాత్రమే చనిపోయారని చెప్పుకొచ్చింది. అంతేగాక, వారికి అవార్డులను ప్రకటించింది. వారి పేర్లను కూడా చైనా విడుదల చేసింది. జిన్‌జియాంగ్ మిలిటరీ కమాండ్‌కు చెందిన రెజిమెంటర్ కమాండర్ క్వి ఫాబావోతో పాటు క్విఫాబావో, చెన్ హాంగ్‌జున్, చెన్ జియాంగ్ రాంగ్, జియావో సియువాన్, వాంగ్ జువారన్ అనే సైనికులు చనిపోయినట్లు చెప్పింది.