రాహుల్ గాంధీని ఏమార్చిన పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి

  • మొన్న పుదుచ్చేరిలో పర్యటించిన రాహుల్
  • సీఎంపై ఫిర్యాదు చేసిన మహిళ
  • ఆమె తనను పొగిడిందంటూ రాహుల్ కి చెప్పిన సీఎం  
  • జనాలకు దొరికిపోయి నవ్వుల పాలు
పుదుచ్చేరిలో పర్యటించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారాయణస్వామి ఏమార్చారు. ఆ తర్వాత జనాలకు దొరికిపోయి విమర్శలపాలయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. పుదుచ్చేరిలో పర్యటించిన రాహుల్ బెస్త కార్మికులతో మాటామంతి నిర్వహించారు.

 ఈ సందర్భంగా ఓ మహిళ మాట్లాడుతూ.. పుదుచ్చేరి తీర ప్రాంతం పూర్తిగా వెనకబడిపోయిందని, ఇక్కడ తమ గోడును పట్టించుకునే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేసింది. ఈయన (సీఎం) కూడా పట్టించుకోలేదని, నివర్ తుపాను సమయంలో కూడా ఆయన ఇక్కడికి రాలేదని రాహుల్‌కు తమిళంలో ఫిర్యాదు చేసింది.

అయితే, ఆమె మాటలను తర్జుమా చేసి రాహుల్‌కు వినిపించిన నారాయణస్వామి.. ఆమె భావాన్ని పూర్తిగా మార్చేశారు. ఆమె తనపై చేసిన ఫిర్యాదును తెలివిగా తన ఘనతగా మార్చేసుకున్నారు. తుపాను సయమంలో తాను ఇక్కడికొచ్చి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు ఆమె చెబుతున్నారని రాహుల్‌కు వివరించారు. అయితే, ఈ లైవ్ వీడియోను చూసిన వారు మాత్రం ముక్కున వేలేసుకున్నారు.


More Telugu News