సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- ముంబైలో ఇల్లు కొనుగోలు చేసిన పూజ
- వరుణ్ తేజ్ సినిమాలో కన్నడ నటుడు
- 'సీటీమార్'లో 'క్రాక్' భామ ఐటం పాట
- ఆకాశ్ పూరి హీరోగా 'చోర్ బజార్'
* తెలుగు, హిందీ భాషల్లో బిజీగా రాణిస్తున్న కథానాయిక పూజ హెగ్డే తాజాగా ముంబైలో ఇల్లు కొనుగోలు చేసిందట. ముంబైలోని ఖరీదైన ప్రాంతమైన బాంద్రాలో సముద్రానికి అభిముఖంగా నిర్మితమైన ఓ అపార్టుమెంటులో త్రీ బెడ్ రూమ్ ఇంటిని పూజ కొన్నట్టు తెలుస్తోంది.
* మెగా హీరో వరుణ్ తేజ్ కథానాయకుడుగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందుతున్న 'గని' చిత్రం షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. ఇందులో కన్నడ నటుడు ఉపేంద్ర ఓ కీలక పాత్ర పోషించడానికి అంగీకరించాడు. తాజాగా ఉపేంద్ర ఈ చిత్రం షూటింగులో జాయిన్ అయ్యాడు.
* రవితేజ హీరోగా ఇటీవల వచ్చిన 'క్రాక్' సినిమా మంచి హిట్టయిన సంగతి తెలిసిందే. ఇందులో ఐటం పాట చేసిన అప్సర రాణికి కూడా ఈ చిత్రం మంచి పేరుతెచ్చింది. ఈ నేపథ్యంలో గోపీచంద్ హీరోగా రూపొందుతున్న 'సీటీమార్' చిత్రంలో ఓ ఐటం సాంగ్ చేసే అవకాశం అప్సరకు వచ్చింది.
* ఆమధ్య 'జార్జిరెడ్డి' వంటి హిట్ చిత్రాన్ని రూపొందించిన జీవన్ రెడ్డి తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించాడు. ఇందులో పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ హీరోగా నటిస్తున్నాడు. 'చోర్ బజార్' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 26 నుంచి జరుగుతుంది.