శంకర్ సినిమాలో చరణ్ సరసన రష్మిక?

  • శంకర్, చరణ్ కాంబోలో దిల్ రాజు సినిమా 
  • త్రీడీ ఫార్మేట్ లో భారీ బడ్జెట్టుతో నిర్మాణం
  • రష్మికను రికమెండ్ చేసిన రామ్ చరణ్
ప్రస్తుతం టాలీవుడ్ లో బాగా డిమాండ్ వున్న కథానాయికలలో రష్మిక ముందు వరుసలో ఉంటుంది. ఇటు తెలుగులో స్టార్ హీరోల సరసన చేస్తూనే.. అటు తమిళ, హిందీ సినిమాలలో కూడా చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలో ఈ చిన్నది త్వరలో మెగా హీరో రామ్ చరణ్ సరసన నటించే అవకాశాన్ని తొలిసారి పొందనుంది.

ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది దిల్ రాజు బ్యానర్లో 50వ చిత్రం కాగా.. చరణ్ కు, శంకర్ కు ఇద్దరికీ కూడా వ్యక్తిగతంగా 15వ చిత్రం అవుతుంది. భారీ కాంబినేషన్ కాబట్టి భారీ బడ్జెట్టుతో దీనిని త్రీడీ ఫార్మేట్ లో నిర్మించాలని ప్లానింగ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో చరణ్ సరసన కథానాయికగా రష్మిక నటించే ఛాన్స్ వుంది. దర్శక నిర్మాతలకు ఆమెను చరణ్ రికమెండ్ చేసినట్టు తెలుస్తోంది.    

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం చరణ్ 'ఆర్ఆర్ఆర్', 'ఆచార్య' చిత్రాలలో నటిస్తున్నాడు. అలాగే, కమలహాసన్ తో శంకర్ 'భారతీయుడు 2' చేస్తున్నారు. ఇవి పూర్తికాగానే, శంకర్, చరణ్ సినిమా సెట్స్ కి వెళుతుంది.


More Telugu News