న్యాయవాదుల హత్య కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ చేసి చేతులు దులుపుకోవద్దు: బండి సంజయ్
- ఇది ప్రభుత్వ హత్యే
- పథకం ప్రకారమే చంపారు
- పూర్తి విచారణ జరపాలి
- కేసీఆర్ స్పందించాలి
హైకోర్టు న్యాయవాదులు గట్టు వామనరావు, నాగమణి దంపతులను బుధవారం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద కొందరు దారుణంగా హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వామనరావు తల్లిదండ్రులను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు ఆ పార్టీ నేతలు పలువురు పరామర్శించారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇది ప్రభుత్వ హత్యేనని ఆయన ఆరోపించారు. పథకం ప్రకారమే న్యాయవాద దంపతులను చంపేశారని, ఈ కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ చేసి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడతారని ఆయన హెచ్చరించారు.
పూర్తి విచారణ పూర్తయిన అనంతరమే చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ హత్యల వెనుక ఎవరున్నారన్న విషయం తెలిసిన అనంతరమే చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ హత్యల ఘటనపై వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ నేతలు దీనిపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.